telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

క్వారంటైన్ కేంద్రాల్లో క్రీడలతో ఉల్లాసం

qurantaine centre

ఏపీలో కరోనా విజృంభించడంతో ఇప్పటివరకు 1.20 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలోనూ కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అధికారులు కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు, వారిని నిత్యం ఉల్లాసంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వారికి క్రీడలు, సంగీతంతో కరోనా థెరపీ అందిస్తున్నారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభించి, ఆపై రోగులు తమకు ఇష్టమైన పాటలు వినే సదుపాయం కల్పించారు. ] అన్ని రకాల క్రీడా ఉపకరణాలు అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్ ఇలా అనేక క్రీడలతో అనంతపురం జిల్లా కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి.

Related posts