telugu navyamedia
సినిమా వార్తలు

భర్తను చీట్ చేసిన ప్రముఖ హాలీవుడ్ సింగర్…!?

Miley

ప్రముఖ హాలీవుడ్ సింగర్ మైలీ సైరస్… హాలీవుడ్ నటుడు లయామ్ హెమ్స్‌వర్త్‌తో పదేళ్ల పాటు డేటింగ్ చేసింది. మైలీ గతేడాది డిసెంబర్ లో అతడిని వివాహం కూడా చేసుకుంది. పెళ్లై ఏడాది కుడా కాకుండానే అతడి నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇద్దరూ విడాకులకు అప్లై చేశారు. ఈ నేపథ్యంలోనే మైలీ మరో యువతిని ముద్దాడుతున్న ఫోటోలు బయటకి వచ్చాయి. దీంతో మైలీకి ఈ విషయంలోనే భర్తతో మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మైలీ తన భర్తను మోసం చేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆమె ఆ వార్తల్లో నిజం లేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేవని తెలిపింది. తనకు స్మోక్ చేసే అలవాటు ఉందని, కొన్ని విషయాల్లో దురుసుగా వ్యవహరిస్తుంటానని, అంతేకానీ అబద్ధాలు చెప్పే అలవాటు లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మైలీ అభిమానులు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు.

Related posts