telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

7 ఏళ్ళు పూర్తి చేసుకున్న “చెన్నై ఎక్స్‌ప్రెస్”… పిక్ షేర్ చేసిన దీపికా

Chennai Express

షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా న‌టించిన‌ చిత్రం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ఏడేళ్లు పూర్తి చేసుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ 2013 లో విడుదలైంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘ‌న విజ‌యం సాధించింది. తమిళనాడు నేపథ్యంలో నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలోని లుంగీ డాన్స్ పాట ప్రేక్ష‌కులను అమితంగా అల‌రించింది. ఈ చిత్రం ప‌లు రికార్డులను కూడా బద్దలుకొట్టింది. ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ న‌టి దీపికా పదుకొనే కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. “ఏడు సంవత్సరాల నాటి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ పిక్ పోస్ట్ చేశారు. దీపికా పదుకొనే షేర్ చేసిన ఫొటోల్లో హీరో షారూఖ్ ఖాన్‌, చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి కూడా క‌నిపిస్తున్నారు.

Related posts