telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి హాజరవ్వలేదు.. కారణమిదే…: చిరంజీవి

chiranjeevi family

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి “సైరా” సినిమా గురించి చర్చించారని అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ కొనసాగింది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు. గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులెవరూ వెళ్లలేదు. కనీసం అభినందనలు కూడా చెప్పలేదు. దీంతో ఈ విషయంపై ఏపీ రాజకీయ పార్టీలతోపాటు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు జగన్‌తో భేటీ అవ్వడం ఏపీ అంతటా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వీరిద్దరూ ఏయే విషయాల పట్ల చర్చించారన్న విషయంపై అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ భేటీపై మాట్లాడిన చిరంజీవి “జగన్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్లలేదన్న దానిపై వ్యాఖ్యలు చేశారు. తాను సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగానే… జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయానన్నారు. జగన్ సీఎం కాగానే, ఆయన్ను కలిసి అభినందించాలని అనుకున్నానన్నారు చిరంజీవి. రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారని తెలిపారు. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు చిరు. పరిశ్రమకు ఏది కావాలన్న సంకోచించకుండా తనని అడగాలని కూడా జగన్ కోరినట్టు చిరంజీవి తెలిపారు. జగన్‌తో భేటీ సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతిని కలిగించింది” అని అన్నారు మెగాస్టార్.

Related posts