telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్

Mahesh

ఆగ‌స్ట్ 31న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు త‌న‌యుడు గౌత‌మ్ ఘ‌ట్ట‌మ‌నేని పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘‘14లోకి అడుగుపెట్టిన గౌత‌మ్‌కి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు. ఓ మంచి యువ‌కుడిగా నువ్వు పెరిగి పెద్ద‌వుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి నేను జ‌ర్నీ చేయ‌డం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి..హ్యాపీ బ‌ర్త్‌డే’’ అంటూ తనయుడి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ మహేష్ ట్వీట్ ట్వీట్ చేశారు. ‘‘గౌతమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. తల్లిదండ్రులమయ్యామనే అనుభూతితోపాటు సంతోషం, ప్రేమను మా జీవితాల్లోకి తీసుకొచ్చాడు. తను ఈ ఏడాది 14 వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్ర‌తి ఏడాది త‌న జీవితంలో ప్రేమ‌, సంతోషం పెరుగుతూ రావాలి. నా ప్రియ‌మైన త‌న‌యుడికి హ్యాపీ బ‌ర్త్‌డే’’ అని న‌మ్ర‌తా శిరోద్క‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే మహేష్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts