telugu navyamedia
Uncategorized

మాథుర్యం

sugatri poetry corner

ప్రియా….!
నా కలంతో నీ పై
ఎన్ని కవితలల్లినా
తనివి తీరదు
నా కుంచెతో నీ పై
ఎన్ని చిత్రాలు గీసినా
తపన ఆగదు
నా స్వరంతో నీ పై
ఎన్ని ప్రేమ గీతాలు పాడినా
ఆశ చావదు
నా మనసు నీకై
నిత్యం పరిగెడుతున్నా
అలసిపోదు
అదే…నీ ప్రేమలోని మాథుర్యం

—-కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి…✍

Related posts