telugu navyamedia
సినిమా వార్తలు

మధుహాసము…

vedukolu poetry corner

సెలయేటి సవ్వడులు సరిగమలై వినిపిస్తే
గోదావరి గలగలలనుకున్నా!
కిలకిలల  ఇలకోయిల గానమై వినిపిస్తే
కిన్నెరసాని సవ్వడులనుకున్నా!
కితకితల పులకింతలై మదిని మురిపిస్తే
కృష్ణమ్మ పద మంజీర రవములనుకున్నా!
హిమమల్లే మనసుతాకి గిలిగింతను కలిగిస్తే
కృష్ణయ్య మధుమురళీరవమనుకున్నా!
బాధలని మరిపిస్తూ మనసుని మురిపిస్తే
బహు వీణియల రాగమేమో అనుకున్నా !
ఏ పూవున రాలిన పుప్పొడి పరిమళమో
ఆ సుస్వరపేటికలో మధువులే దాగినవో
రేపటి ధ్యాసనే రానీయక
కాలస్థంభనలో గడిపేయగా
విన్నాను నేను వీనులందునావేడుక
ఏనాడు వినలేదు ఆమధుర హాసనివేదిక
ఏం మాయచేసావో  నేస్తమా!
హాయిగొలుపు నవ్వై నిలిచావు నా హృదిలో!
మధుహాసముతో  పూవై విరిసావు నా మదిలో!

-అవేరా

Related posts