telugu navyamedia
సినిమా వార్తలు

రజినీకాంత్ భార్య బయటపెట్టిన వీడియో… సంచలనం

Latha-Rajinikanth

ఇటీవల చిన్నపిల్లలని చిత్ర వద్దకు గురిచేసే సంఘటనలు ఎక్కువవుతూనే ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ దయా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పౌండేషన్ ఎక్కువగా అనాధ పిల్లలని అక్కున చేర్చుకుంటుంది. పీస్ ఆఫ్ చిల్డ్రన్ పేరుతో లతా రజనీకాంత్ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లతా రజనీకాంత్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో హృదయ విదారకంగా ఉంది. ఓ మహిళ చిన్నారిని కొడుతూ, కాలితో తొక్కుతూ, కింద పడేస్తూ చిత్రవధకు గురిచేస్తున్న వీడియో అది. దీనిపై లతా రజనీకాంత్ స్పందించారు. ఈ వీడియోను లతా రజనీకాంత్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ చిన్నారి ఆచూకీ తెలిసిన వారు తమకు ఫోన్ చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ను ఇచ్చారు.

Related posts