బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల 14వ తేదీన తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. ఆయన మరణంపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐదుగురితో కూడిన అధికారుల టీం ఇప్పటికే దాదాపు 35 మందిని విచారించారు. అన్ని విషయాలపై సమగ్ర నివేదికను రెడీ చేస్తున్నారట పోలీసులు. ఆయన ఈ లోకం విడిచి వెళ్లి నెలా రోజులు గడిచిన సందర్భంగా అతనితో జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి. సుశాంత్‌తో దిగిన ఫోటోలని షేర్ చేస్తూ.. భావోద్వేగ పూరిత పోస్ట్ చేసింది. ”నువ్వు లేవని తెలిసిన ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా హృదయానికి తగిలిన గాయం నేటికీ కాస్తయినా మానలేదు. ప్రేమపై నమ్మకం కలిగించి, జీవిత పాఠాలు చెప్పిన వ్యక్తివి నువ్వే. అందంతో పాటు అణుకువ గల వ్యక్తివి నువ్వు. ఇప్పుడు మరో లోకంలో చాలా ప్రశాంతంగా ఉండి ఉంటావు. చందమామ, నక్షత్రాలు, గెలాక్సీలు ఈ గొప్ప భౌతిక శాస్త్రవేత్తను హృదయపూర్వకంగా ఆహ్వానించి ఉంటాయి. ప్రశాంతంగా ఉండు సుశీ. నిన్ను కోల్పోయి 30 రోజులు పూర్తయ్యాయి. కానీ, జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అని రియా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
next post