telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ బోర్డ్ టెండర్లతో తనకేం సంబంధం: కేటీఆర్

KTR Counter pawan comments

తెలంగాణలో ప్రతిపక్షాల తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఏ అంశం దొరకక ఇంటర్ బోర్డ్ సమస్యను రగలిస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని విమర్శించారు.

ఇంటర్ బోర్డ్ టెండర్లు ఇచ్చిందని, దాంతో తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. గ్లోబరీనాకు టెండర్ దక్కిత తప్పు తనకు అంటగడుతున్నారని అన్నారు. రూ. 4 కోట్ల టెండర్‌ను రూ.10వేల కోట్ల స్కామ్‌గా చెబుతున్నారని దుయ్యబట్టారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు.

ఓ బఫూన్ వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? అని ఫైర్ అయ్యారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయితీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ తెలిపారు.

Related posts