telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రంజాన్ మాసం ప్రారంభం..ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి: సీఎం కేసీఆర్

KCR cm telangana

నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌లో ప్రతిరోజూ రాత్రివేళ చేసే తరావీ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇంటి వద్దనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ముస్లింలకు సూచించారు. ప్రజలెవరూ బయటికి రావొద్దని అన్నారు. ఈ పవిత్ర మాసం మన సమాజంలో సామరస్యం, సంతోషం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం సందేశాన్ని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.

కరోనా ప్రభావంతో భౌతికదూరం పాటించాలనే నియమంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసేదాకా… ఆ తర్వాత కూడా ఇఫ్తార్‌ విందులకు అనుమతి లేదు. ఇక తొలిసారి హలీమ్‌ లేకుండానే రంజాన్‌ ఉపవాస దీక్షలు జరగనున్నాయి. ఏటా హైదరాబాద్‌లో పెద్దమొత్తంలో హలీమ్‌ వ్యాపారం జరిగేది. ఈ సారి అది లేకుండానే రంజాన్‌ ఉపవాస దీక్షలు జరుగనున్నాయి.

Related posts