telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష.. బెంగళూరులో 144 సెక్షన్

black magic in karnataka assembly

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి మరికాసేపట్లో తెరపడనుంది . సీఎం హెచ్ డీ కుమారస్వామి బలపరీక్షపై మరికాససేపట్లో ఓటింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి ప్రసంగం కొనసాగుతోంది. తనకు మూడు గంటల సమయం కావాలని కుమారస్వామి కోరగా, ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ స్పష్టం చేశారు.

సీఎం ప్రసంగం తర్వాత బలపరీక్ష ఓటింగ్ ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం పడిపోతే అవాంఛనీయ చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. ఇటీవల నెలకొన్న నాటకీయ పరిణామాల మధ్య కుమార స్వామి ప్రభుత్వం అవిశ్వాసం నుంచి బయటపడుతుందో వేచిచూడాలి మరి.

Related posts