telugu navyamedia
సినిమా వార్తలు

సీక్రెట్… గర్భవతిగా స్టార్ హీరోయిన్…

Shruthi-Haraharan

ప్రముఖ హీరోయిన్ కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల శృతి గత ఏడాది మీటూ ఉద్యమం ఉధృతంగా మారినవేళ సీనియర్ హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే అప్పటి వరకు ఆమె సన్నిహితులకు తప్ప మరెవరికీ తెలియని శృతి హరిహరన్ పెళ్లి విషయం బయటపడింది. హీరోయిన్ గా కెరీర్ కాపాడుకోవడం కోసం తనకు పెళ్ళైన విషయాన్ని శృతి హరిహరన్ దాచి ఉంచింది. రామ్ కుమార్ అనే రచయితతో నాలుగేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన తర్వాత… వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారు. తాజాగా శృతి హరిహరన్ మరో ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. తాను నిండు గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తనకు పుట్టబోయే బిడ్డని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో “నా జీవితం ఇప్పుడు నీ గుండె చప్పుళ్లతో నెలకొంది. ప్రపంచమనే సర్కస్ లోకి నిన్ను ఆహ్వానిస్తున్నా. నిన్ను చూసేందుకు ఎక్కువ కాలం ఎదురుచూడలేను” అంటూ శృతి హరిహరన్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts