telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపిస్తాం: మంత్రి కన్నబాబు

minister kannababu

విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ ఘటనలో బాధితులు ఎవరైతే ఆసుపత్రికి వెళ్లారో వారికి ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేయమని ఆదేశించామని, బాధితులను తరలించేందుకు అంబులెన్స్ లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పరిశ్రమ గతంలో విశాఖ శివార్లలో ఉండేదనినగర విస్తరణ తర్వాత ఇబ్బందులు వచ్చాయని మంత్రి అన్నారు. ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్ తయారీలో స్టిరీన్ గ్యాస్ వినియోగిస్తారు. ఈ పరిశ్రమ నుంచి గతంలో కూడా గ్యాస్ లీకైనట్టు స్థానికులు చెబుతున్నారు.  ఈ విషయమై అధికారులకు నేతలకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. 

Related posts