telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆమె” రీమేక్ లో కంగనా కాదు…!

KAngana-Ranauth

అమలా పాల్ హీరోయిన్‌గా రత్నకుమార్ తెరకెక్కించిన సినిమా ‘ఆడై’. తెలుగులో ఆమెగా అనువాదమైంది ఈ చిత్రం. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కమర్షియల్‌గా అనుకున్న రీతిలో విజయం సాధించకపోయినా కూడా ఆమె నటనకు మాత్రం అద్భుతమైన మార్కులు పడ్డాయి. అమలాపాల్‌ బోల్డు పాత్రలో నటించిన ‘ఆడై’ హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్‌ నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాగా, అమలాపాల్‌ బోల్డ్‌ యాక్టింగ్‌తో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. మొత్తానికి ఇండస్ర్టీలో హాట్‌టాపిక్‌ అయిన ‘ఆడై’ హిందీలో రీమేక్‌ కాబోతుందని, హిందీ వెర్షన్‌లో అమలాపాల్‌ పాత్రలో బాలీవుడ్‌ తార కంగనా రౌనత్‌ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే నటుడు, నిర్మాత అరుణ్‌ పాండ్యన్‌ ఆ వార్తలను ఖండించారు. ‘ఆడై’ రీమేక్‌ హక్కులను అన్ని భాషల్లోను అరుణ్‌ పాండ్యన్‌కు సొంతమైన ఏఅండ్‌పి గ్రూప్స్‌ దక్కించుకుంది. ‘ఆడై’ హిందీ రీమేక్‌ కంగనా రౌనత్‌ నటిస్తుందన్న వార్తలు వాస్తవం కాదని, తాము అసలు ఆమెను సంప్రదించలేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

Related posts