telugu navyamedia
telugu cinema news

నందమూరి హీరోతో “మజ్ను” దర్శకుడు

Kalyan-Ram
డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ “118”. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 1న విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ఇంకా విడుదలకు సిద్ధమవుతుండగానే కళ్యాణ్ రామ్ మరో దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్. నానితో “మజ్న” సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వేసవిలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దర్శకుడు విరించి వర్మ “ఉయ్యాల జంపాల” చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.  

Related posts

కెప్టెన్ అమెరికాకు ఐరన్ మ్యాన్ గిఫ్ట్… చూసి తీరాల్సిందే…!

vimala p

మహర్షి టీజర్ .. ఉగాదికేనట… !

vimala p