telugu navyamedia
telugu cinema news trending

కాజల్ ‘సీత’ చిత్రం విడుదల .. వాయిదా..

కాజల్ కూడా గ్లామరస్ పాత్రలతోనే యూత్ హృదయాలను కొల్లగొట్టే పాత్రలను కాదనుకొని.. నయనతార .. అనుష్క .. త్రిష బాటలో నడవడానికి సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తోంది. నాయిక ప్రాధాన్యత గల పాత్రలను చేయడానికి రంగంలోకి దిగిపోయింది. తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే సినిమాను చేసింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ సినిమా, విడుదలకి ముస్తాబవుతోంది.

ఈ సినిమాను విభిన్నమైన కథాకథనాలతో రూపొందించారు. ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం సందేహమే అనే మాట ఫిల్మ్ నగర్ లో బలంగా వినిపిస్తోంది. కొన్ని కారణాల వలన విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. విలన్ గా సోనూ సూద్ నటించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

Related posts

పాలన మారాలి.. ప్రజాభిష్టం నెరవేరట్లేదు .. : రోశయ్య

vimala p

జూ.ఎన్టీఆర్ తోనే .. టీడీపీ భవిష్యత్తు …ఓటు వేసుప్పుడు ఆలోచించండి..

vimala p

అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరి ఖాతాలోకి 15లక్షలు, ..నెలకు 12 వేలు కూడా.. : రాహుల్ గాంధీ

vimala p