telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తమిళంలో .. జూ. ఎన్టీఆర్ యమదొంగ..

jr.ntr yamadonga now in tamil version

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు తమిళంలో డబ్బింగ్ చేసుకొని రిలీజ్ అవుతుండటం తెలిసినవిషయమే. రాజమౌళి సినిమాలు దాదాపుగా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంటాయి. మగధీర, ఈగ, బాహుబలి సినిమాలు తమిళంలో కూడా మంచి విజయాలు సాధించాయి. బాహుబలి సినిమా అక్కడ కూడా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. 12 ఏళ్ల క్రితం తెలుగులో రిలీజ్ అయ్యి దుమ్మురేపిన యమదొంగ సినిమాను ఇప్పుడు తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. 12 ఏళ్ళ తరువాత సినిమా అక్కడ రిలీజ్ కాబోతుండటం విశేషం.

రాజమౌళి సినిమాలకు క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను అక్కడ ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దాదాపుగా డబ్బింగ్ పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. శివాజీ గణేశన్ మయనుక్కు యమన్, రజినీకాంత్ అదిశయ పిరవి సినిమాల బాటలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాను విజయన్ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దీనిని అక్కడ బాగానే ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts