telugu navyamedia
సినిమా వార్తలు

మెగా మాస్ “చిరు 154” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

మెగాస్టార్ చిరంజీవి  హీరోగా బాబీ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘మెగా154 .. మాస్‌ కథాంశంతో సిద్ధమవుతోన్నఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికీ టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఓ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది

జ‌న‌వ‌రి 2023 సంక్రాంతికి క‌లుద్దాం అంటూ..చిరంజీవి  లంగరు చేతిలో ప‌ట్టుకున్నపోస్ట‌ర్ విడుద ల చేశారు. పోస్టర్ చూస్తే సినిమా ఫుల్‌ మాస్‌ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.

అలాగే ‘టైటిల్‌, టీజర్‌.. త్వరలోనే ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది . దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

megastar chiranjeevi 154

‘మెగా 154’కి ‘వాల్తేరు వీరయ్య’గా ఖరారు చేసినట్టు ప్రకటించారు. కానీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం చేయలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు ఈ సినిమాలో చిరు ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Related posts