telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జిన్ పింగ్ తో మోడీ అనధికార పర్యటన .. మసిపూసి మారేడుకాయ చేసే యత్నమేనా..

jinping india tour modi workout for bjp

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండు రోజుల అనధికార పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన మహాబలిపురం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను ప్రధాని మోడీ, జిన్ పింగ్ వీక్షించారు.

చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అంతకుముందు, చారిత్రక కట్టడాలను మోడీ, జిన్ పింగ్ వీక్షించారు. మహాబలిపురంలోని ఆలయాల ప్రత్యేకత గురించి, రాతి శిల్పకళా కట్టడాలు, ఏకశిలా కట్టడాల విశిష్ఠతను, కృష్ణుడి వెన్నముద్ద శిలను జిన్ పింగ్ కు మోడీ వివరించారు. పంచ కట్టులో కనిపించిన మోడీ తమిళులను ఆకట్టుకోడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడా.. బీజేపీ రాజకీయాలకు జిన్ పింగ్ బలైయ్యాడా.. పాక్ కి చైనా-భారత్ స్నేహం గురించి మసిపూసి మారేడుకాయ చేసి చూపిస్తున్నాడా .. ఈ అనధికార పర్యటనపై భారతీయులతో సహా పాక్ ప్రభుత్వానికి కూడా పై ప్రశ్నలు తలెత్తక మానవు. ఈ పర్యటనకు వచ్చేముందే జిన్ పింగ్ కశ్మీర్ పై పాక్ కు వ్యతిరేకంగా ప్రకటన చేయటం.. కూడా మరో మెలికేనా.. ఏది ఏమైనా చైనా అధ్యక్షుడు రెండు రోజులు భారతదేశంలో విహారయాత్రకు వచ్చినట్టు సమయం గడిపి వెళ్ళిపోతాడా… మొదటినుండి బీజేపీ ప్రభుత్వం ఈ పర్యటనలో ఎటువంటి ఒప్పందాలు ఉండవని స్పష్టం చేయడం తెలిసిన విషయమే. మొత్తానికి కశ్మీర్ విషయాన్నీ బీజేపీ తమ సొంతానికి వాడేసుకుంటుంది. అదే ఈ పర్యటన తమిళనాడులో ఏర్పాటు చేయడం వెనుక రహస్యం.

2019 ఎన్నికలకు ముందు బీజేపీకి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ, పుల్వామా ఘటన జరగటం దానిపై ప్రతీకారం తీర్చుకోవడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. అది బాగా అర్ధం చేసుకుంది బీజేపీ. అందుకే అధికారం లోకి రాగానే కశ్మీర్ విషయం తెరపైకి తెచ్చేసింది. అంటే ఈసారి ఎన్నికలలో బీజేపీ విజయానికి దారి సుగమం అయిపోయినట్టే .. అయితే చిన్న ప్రతీకారానికే ప్రజలు ఐదేళ్లు అధికారం కట్టబెడితే, ఎప్పటినుండో రక్తంలో కలిసిపోయిన కశ్మీర్ విషయాన్నీ కదిపితే కనీసం పదేళ్లయినా అధికారం దక్కాలి కదా. అందుకే కశ్మీర్ 2022 నాటికే పరిష్కారం అవుతుంది. కారణం, అప్పుడే ఎన్నికలు వస్తాయి మరి. అంటే 2022 లో అధికారం రాగానే కశ్మీర్ భారత్ లోకి వచ్చేస్తుంది.. అదే తరువాతి ఎన్నికలలో విజయానికి మెట్టు.. అంటే 2027లో కూడా బీజేపీ విజయానికి 2019లోనే వ్యూహరచన చేసింది. అమలు కూడా అనుకున్నట్టే చేసుకుపోతుంది. భారీ మెజారిటీ తో ఇప్పటికే గెలిచారు కాబట్టి, ఇంకా గొప్పగా విజయం దక్కనుందని ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం లేదు, కశ్మీర్ కదా మరి.. ఆ మాత్రం ప్రభావం ఉంటుంది. దీనితో ప్రాంతీయ పార్టీలు, ఇతరత్రా స్నేహాలు కూడా బీజేపీకి మున్ముందు అవసరం లేనట్టే. ఇదంతా బీజేపీకి తిరుగులేని స్థాయికి తీసుకెళ్లే కాలం .. ఆపడం కష్టమే మరి. మరో రెండు సార్లు బీజేపీ కేంద్రంలోనే.. దీనికి వాళ్ళు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. చూద్దాం కాలం ఎటు తిప్పుతుందో..!

Related posts