telugu navyamedia
andhra news study news

ఈనెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Degree exams TDP questiona Anantapur

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 14 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. 4 లక్షల 24 వేల 500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు స్పష్టంచేశారు. ఇందుకోసం 922 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లక్షా 75 వేల మంది ఇంఫ్రూవ్‌మెంట్ పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు.

మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరగనుందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ జరుగుతాయని వివరించారు. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు.

Related posts

ప్రశ్నించాలనే ప్రజలు నన్ను గెలిపించారు: రేవంత్

vimala p

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్

vimala p

పెట్రోల్ కంటే.. విమాన ఇంధన ధర తక్కువ…అందరూ అవే కొనుక్కోవాలా..

vimala p