telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు సెటైర్లు ..

టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిప‌డ్డారు. బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రయివేటు ఫంక్షన్ హల్‌లో కార్యకర్తలతో సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో రాజ్యసభకు అర్హులైనవారే లేరా అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

రాజ్యసభ సీట్లు రెండు తెలంగాణ, రెండు ఆంధ్రాకు ఇచ్చి సమ న్యాయం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందులో కూడా ఇద్దరు తెలుగుదేశం మాజీలు, మరో ఇద్దరు ఆయనకు కావాల్సిన వాళ్లని టీడీపీ అధినేత చెప్పారు.

ఆయనకు కావాల్సిన ఇద్దరిలో ఒకరు వివేకా హత్య కేసులో ప్రత్యేక లాయర్‌గా వ్యవహరించి ఆ కేసు మీద పోరాడిన వ్యక్తని.. అనుకూలంగా కాదని, వ్యతిరేకంగా అని.. అలాంటి వ్యక్తి అయిన నిరంజన్‌ రెడ్డిని జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తప్పులు ఎత్తిచూపితే ఎల్లో మీడియా అని ముద్ర వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పిందన్నారు. నిజాలు చెబితే వెంకాయమ్మ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. సమస్యలు చెప్పేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. .

పులివెందులలో ప్రజలకు బస్టాండ్ లేకుండా చేసిన సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పులివెందులలో తాగునీరు ఇవ్వలేని జగన్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

ప్రజల నాడి చూస్తే జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంద‌ని… ఎందుకంటే బాదుడే బాదుడు ప్రతి ఇంటికి చేరిందన్నారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడు అని సెటైర్లు వేశారు.

జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయి. దీపం కింద వంట గ్యాస్ లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక దీపం ఆర్పేశాడ‌ని చంద్ర‌బాబు అన్నారు.

Related posts