telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ ఫలితాల్లో మరో కోణం ..అర్హత లేకున్నా గ్లోబెరినాకు పనులు!

inter board telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా తీవ్రతరం అవుతున్ననేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఫలితాల్లో జరిగిన తప్పిదాల పై నివేదిక సమర్పించాలని బోర్డ్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల మరో నిర్వాకం బయటపడింది. దాంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల మెమోల తయారీలో జరిగిన అవకతవకలన్నింటికీ బోర్డు బాధ్యత వహించాల్సిన పరిస్థితిలో పడింది. పరీక్షలకు సంబంధించిన సాంకేతికపరమైన పనులను నిర్వహించడానికి అవసరమైన కీలక ఒప్పందాలేవీ బోర్డు గ్లోబెరినాతో చేసుకోలేదని పరీక్షల అవకతవకలపై విచారణ జరపడానికి ఏర్పాటైన నిపుణుల కమిటీ గుర్తించినట్లు సమాచారం.

కేవలం పర్చేజ్ ఆర్డర్ మీద గ్లోబెరినాకు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. తాత్కాలిక నివేదిక రూపొందించడానికి నిపుణుల కమిటీ బోర్డు కార్యదర్శి ఎ. అశోక్, పరీక్ష కంట్రోలర్ అబ్దుల్ ఖలీద్, పరిపాలన సంయుక్త కార్యదర్శి భీం సింగ్ లను విచారించినట్లు తెలుస్తోంది. ఏదో కారణంతో గ్లోబెరినాతో ఒప్పందం చేసుకోవడాన్ని అధికారులు దాటవేస్తూ వచ్చారని సమాచారం. అందుకే, పని చేస్తున్న సంస్థల పేర్లను తన వెబ్ సైట్ లో పొందుపరిచిన గ్లోబెరినా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును పేరును పొందపరచలేదని తెలుస్తోంది.

Related posts