telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

విమానాలను హైజాక్ చేసే ప్రమాదం.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక.. ! భద్రత పెంచిన అధికారులు.. !!

intelligence warning on plane hijack

భారత్-పాక్ మధ్య ఇంకా ఉద్రిక్తత తగ్గినట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి కారణంగా బలవంతంగా అభినందన్ ను అప్పగించిన పాక్, ఓటమి తో కసిగా ఉంది. దీనితో ఏదో ఒక ఉపద్రవం భారత్ లో సృంచించాలనే ఆలోచనలో ఉన్నట్టే ఉంది. అయితే అది ఎలా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని ఇంటెలిజెన్స్ కూడా అధికారులకు హెచ్చరికలు జారీచేసింది. పాక్ ప్రయత్నాలలో(అదే ఆ దేశంలో ఉన్న ఉగ్రమూకల) .. ఇది ఒకటి అయిఉండవచ్చు. విమానాలను హైజాక్ చేయనున్నామని బెదిరింపులు రావడంతో చెన్నై ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి తరువాత, భారత వాయుసేన దళాలు పాక్ పై సర్జికల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానాలను హైజాక్ చేయనున్నామని పలు ప్రాంతాల్లో బెదిరింపులు రాగా, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు.

ఓ ప్రత్యేక ప్రకటన ద్వారా పౌరవిమానయాన శాఖ భద్రతను పెంచాలని, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే ప్రయాణికులను ఎయిర్ పోర్టులోకి పంపాలని ఆదేశించింది. ఆపై సందర్శకులను అనుమతించ వద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నైతో పాటు హైదరాబాద్, కొచ్చిన్, కోయంబత్తూర్, విజయవాడ, బెంగళూరు తదితర దక్షిణాది రాష్ట్రాల ఎయిర్ పోర్టుల్లోనూ భద్రతను పెంచారు.

Related posts