telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో కరోనా తగ్గుముఖం..కొత్తగా 11వేల 499 నమోదు

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది..గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,499 కేసులు నమోదయ్యాయి. 23,598మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా మరో 255 మంది మరణించారు.

పాజిటివిటీ రేటు 1.01శాతానికి న‌మోద‌య్యింద‌ని ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

మ‌రోవైపు..దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 1,77,17,68,379కి చేరింది.

Related posts