telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఆకలి ఎక్కువ అయినా .. సమస్యలే..! అధికబరువుకు అరంగుళం దూరంలో ఉన్నట్టే…!!

over hunger is most dangerous to weight balance

సాధారణ ఆకలికి, విపరీతమైన ఆకలికి తేడా గమనించాలి. అందరికి ఉన్నట్టే, రోజు మూడు లేదా నాలుగు సార్లు ఆకలి వేయడం .. ఆ సమయానికి ఏదో ఒకటి కడుపులో వేయడం అనేది సాధారణం. అలా కాకుండా తిన్నా కూడా ఆకలిగానే ఉందటం దానితో ఇంకా ఇంకా తింటూనే ఉండటం మాత్రం సమస్యగా గుర్తించాలి. ఈ క్ర‌మంలో అలాంటి వారు బ‌రువు కూడా పెరుగుతుంటారు. అయితే ఆక‌లిని నియంత్రిస్తే మ‌నం బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లిని నియంత్రించ‌వ‌చ్చు. పైగా మ‌న శ‌రీరానికి పోష‌ణ కూడా ల‌భిస్తుంది. మ‌రి ఆక‌లిని నియంత్రించే ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..!

* ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే బీన్స్, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, తృణ ధాన్యాలు త‌దిత‌ర ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం పాటు ఉన్నా ఆక‌లి కాకుండా ఉంటుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోవ‌డం మానేస్తారు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

* కోడిగుడ్లు, సోయా ఉత్ప‌త్తులు, పెరుగు, ప‌ప్పు దినుసులు తదిత‌ర ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బ‌రువు త‌గ్గుతారు.

over hunger is most dangerous to weight balance* అవ‌కాడో, ఆలివ్ ఆయిల్‌, కొబ్బరినూనెల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. త‌ద్వారా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* భోజ‌నం చేసేముందు సూప్ తాగాలి. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా శ‌రీరంలో ఎక్కువ క్యాలరీలు చేర‌కుండా, కొవ్వు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

* భోజ‌నానికి ముందు అల్లం ర‌సం తాగ‌డం, డార్క్ చాక్లెట్ తిన‌డం లేదా కాఫీ తాగ‌డం, త‌క్కువ ఆహారాన్ని ఎక్కువ సేపు తిన‌డం చేసినా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

Related posts