telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగటం .. ఆరోగ్యమేనా..!!

coconut water for health

వేసవి కాలంలో కొబ్బ‌రినీళ్లు తాగటం చాలా సహజం, అవసరం కూడా. ఈ నీళ్లలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌పడే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొబ్బ‌రి నీళ్ల‌ను చాలా మంది వేస‌విలో తాగేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని ఏ కాలంలోనైనా తాగ‌వ‌చ్చు. కొబ్బ‌రినీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* రోజూ ప‌ర‌గ‌డుపున కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంలో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

coconut water for healtha* మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి. శ‌రీరానికి కొత్త శ‌క్తి వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

* జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌లబ‌ద్ద‌కం ఉండదు. విరేచ‌నం సాఫీగా అవుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డే వారు ఉద‌యాన్నే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే మంచిది.

* కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. నేత్ర స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి.

Related posts