telugu navyamedia
క్రీడలు వార్తలు

పింక్ టెస్టుకు జట్లను ప్రకటించిన ఇంగ్లాండ్, భారత్

ప్రస్తుతం భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభం కంటే ముందు మొదటి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు తాజాగా చివరి రెండు టెస్టులకు 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఆసీస్ సిరీస్ లో గాయపడిన ఉమేష్ యాదవ్ ఇంగ్లాండ్ తో మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉండగా చివరి రెండు టెస్టులకు జట్టులో స్థానం దకించుకున్నాడు. అలాగే శార్దుల్ ఠాకూర్ ను విజయ్ హజారే టోర్నీ కోసం బీసీసీఐ విడుదల చేసింది. ఇక మూడో పింక్‌ బాల్‌  టెస్ట్‌కు 17 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్‌ తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక పర్యటన తర్వాత విరామం తీసుకున్న జానీ బెయిర్‌ స్టో, మార్క్‌ వుడ్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే మొయిన్‌ అలీకి చోటు దక్కలేదు. విరామం కోసం అతడు స్వదేశానికి రానున్నాడని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. రెండో టెస్ట్‌లో రాణించిన మెయిన్‌.. 8 వికెట్లు తీసుకున్నాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మొతేరా వేదికగా.. ఈ నెల 24న మూడో టెస్ట్‌ అయిన పింక్ ప్రారంభం కానుంది.

టీం ఇండియా : విరాట్ కోహ్లీ (c), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మాన్‌ గిల్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ పదవ్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్.

ఇంగ్లాండ్ జట్టు : జో రూట్ (c), జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, ఆలీ స్టోన్, క్రిస్ వోక్స్ , మార్క్ వుడ్.

Related posts