telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ : ఈటల

eetela sudden visit to karimnagar govt hospital

మన దేశంలో రోజుకు దాదాపు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో  మాత్రం కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పడుతున్న సంగతి  తెలిసిందే. అయితే, చలికాలం ప్రారంభం కావడంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నది. దీంతో  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. ఇక ఈరోజు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కుందన్ బాగ్, ముక్తాలోని బస్తి దవాఖానాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇండియాకు అనేక వ్యాక్సిన్ కంపెనీలు వస్తున్నాయని, ఎప్పటి లోగా వ్యాక్సిన్  వస్తుందనే విషయం గురించి తాము కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని అడిగామని అన్నారు. ప్రోటోకాల్స్ పూర్తి చేస్తున్నట్టు  తెలిపారని ఈటల పేర్కొన్నారు. ఇక ముందుగా హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. తరువాత వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో  ఉంటుంది. బస్తీల్లో ఉండే పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అయన పేర్కొన్నారు.

Related posts