telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బ్రహ్మను సృష్టించిన ఆదిశక్తి…. అమ్మతనానికే అదిమూర్తి!

అమ్మ ..రెండక్షరాల పదంకాదు….
అనంతమైన అనురాగం!
అమ్మ ..రెండక్షరాల మాట కాదు….
మూర్తీభవించిన మమకారం!

అమ్మను బ్రహ్మ సృషించినా….
బ్రహ్మను సృష్టించిన ఆదిశక్తి….
అమ్మతనానికే అదిమూర్తి!

అమ్మను మించిన దైవం లేదు
అమ్మను మించిన గురువులేడు
అమ్మ సేవను మించిన జీవనం లేదు
ఆమె పాదపూజను మించిన పూజ లేదు!

కనిపించే దేవుడు అమ్మ
కురిసే కరుణ అమ్మ
దండం పట్టని గురువు అమ్మ
దండంపెట్టవలసిన దైవం అమ్మ
అగుపించే అనురాగం అమ్మ
ముంచెత్తే మమకారం అమ్మ!

కడుపులోపడ్డ దగ్గర్నుండి
కాటికి పోయేవరకు
కంటికి రెప్పలా కాచుకొనేదే
కన్నతల్లి అనుబంధం!

అందరిపాత్రలు ఆమె పోషించగలదు
అమ్మ పాత్ర మాత్రం ఎవరూ పోషించలేరు!
ప్రపంచానికి ఆమె తల్లిగా తెలిసినా….
ఆమెకుమాత్రం… కుటుంబమే ప్రపంచం!

ఆమె నవ్వే… ఆనంద భాండాగారం
నిస్వార్ధమే… ఆమె జీవన విధానం
ఆగ్రహించినా ..అలకచెందినా
విసుక్కున్నా ..విరుచుకుపడ్డా
దూషించినా ..దగా చేసినా
నా బిడ్డే కదా అని….
క్షమించే సహనమూర్తి.. అమ్మ!

రహదారి పాలు చేసినా
అనాధాశ్రమానికి పంపినా
వెట్టిచాకిరీ చేయించినా
వేధించి.. బాధించినా
అన్నం పెట్టకపోయినా
ఆస్తి లాక్కుని.. ఆవలికి నెట్టినా
అవమానాలు పాలుచేసినా
ఆఖరి క్షణాల్లో కూడా….
బిడ్డను చూడాలని తపించే
భోళా మనిషి అమ్మ!

కనిపించే దైవాన్ని వదిలి
కనపడని దేవుడుకోసం
ప్రార్థనలు… పూజలు
నోములు … వ్రతాలు
హారతులు … హామాలు
ఉపవాసాలు .. దీక్షలు
విచిత్రమనిపిస్తుంది!

Related posts