telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆధార్‌ కార్డు .. మార్పులుచేర్పులలో .. వెసులుబాటు..

aadhar

ఆధార్‌ కార్డు దారులకు యూఐడిఏఐ వెసులుబాటును కల్పించింది. ఆధార్‌ కార్డులో ఫోటో, బయోమెట్రిక్స్‌, నమోదిత మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ లాంటి సమాచార అప్‌డేట్‌ కోసం ఇకపై ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సినవసరం లేదు. కేవలం తమ ఆధార్‌ కార్డును తీసుకొని దగ్గరలోని ఆధార్‌ కేంద్రానికి వెళ్లి కావాల్సిన సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో యూఐడిఏఐ పోస్ట్‌ చేసింది.

దీని ప్రకారం..పుట్టిన తేదీ, జెండర్‌ అప్‌డేట్‌ కోసం మాత్రం ఒక్క అవకాశమే ఉంటుంది. ఇక పేరు మార్పునకు మాత్రం రెండు సార్లు అవకావం కలదు. అలాగే వ్యక్తి వయస్సుకు సంబంధించి ఏజ్‌ గ్యాప్‌ మూడేండ్లు ఎక్కువ లేదా తక్కువ ఉంటే మాత్రం అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మూడేండ్లకు మించి ఉంటే మాత్రం దగ్గరలోని యూఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

Related posts