telugu navyamedia
business news news

ఈరోజు బంగారం ధరలు ఇలా…

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 90 పెరిగి రూ. 49,530 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 45,410 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,190 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,190 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు మాత్రం షాకిచ్చాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 600 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.74,400 వద్ద ఉన్నది.

Related posts

ఫొటో తీసి పంపితే కరెంట్ బిల్… త్వరలో డిస్కమ్ యాప్!

vimala p

తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల బాలుడు

vimala p

నీటి తరలింపును అడ్డుకోలేకపోయారు..టీఆర్ఎస్ నేతలపై జగ్గారెడ్డి ఫైర్

vimala p