telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మొదటి షెడ్యూల్ పూర్తి…

Rana-and-pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దగ్గుబాటి హీరో రానా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక మార్చి 1 నుండి ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్న ఇంతవరకు చిత్రయూనిట్ అధికారికంగా ఎవరి పేర్లను అనౌన్స్ చేయలేదు. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమాకి తెలుగులో ‘బిల్లా-రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.డి.వి. ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts