telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ .. దొరికితే లైసెన్స్ రద్దే ..! మొదటి శిక్ష ఖరారు..

drunk and drive results licence cancellation

మందుబాబులు, తాగి వాహనాలు నడపకండి అని ఎన్ని సార్లు మొత్తుకున్నా వినడం లేదు. అందుకే వీళ్ల ఆట కట్టించడానికి ట్రాఫిక్ పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ తనిఖీల్లో దొరికిన వాళ్లకు శిక్షలు విధిస్తున్నా వాళ్లు తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీలు చేస్తున్న సమయంలోనే ఓ మందుబాబు బుక్కయ్యాడు. దీనితో సెవెంత్‌ స్పెషల్‌ సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అతడి లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు, జైలు శిక్ష కూడా విధించింది.

గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని సూరారంకు చెందిన లాల్‌మహ్మద్‌ 4రోజుల క్రితం జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద నిర్వహిస్తున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో పట్టుబడ్డాడు. దీనితో పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేయడంతోపాటు లాల్‌మహ్మద్‌ను మేడ్చల్‌లోని సెవెంత్‌ స్పెషల్‌ సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటికే అతడు రెండు సార్లు మద్యం సేవించినట్లు విచారణలో తేలింది. దీనితో అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు 20 రోజుల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించడం మామూలే అయినా లైసెన్స్ రద్దు కావడం మాత్రం రాష్ట్రంలో ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.

Related posts