telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా వైరస్ గురించి డా. వైయస్ సునీతారెడ్డి సూచనలు!

ys sunitha

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దివంగత వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పలు సూచనలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మన శరీర లక్షణాలను బట్టి చికిత్స తీసుకోవాలని ఆమె సూచించారు. జ్వరంగా ఉంటే పారాసిటమాల్, దగ్గు ఉంటే దానికి తగ్గ మందు తీసుకోవాలని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఎవరినీ కలవకుండా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలని అన్నారు.

చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొడవచ్చని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని 14 నుంచి 15 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టడం అవసరమని సునీతారెడ్డి అన్నారు. ఫోన్లలో మాట్లాడటం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక స్థైర్యాన్ని పొందొచ్చని చెప్పారు. క్వారంటైన్ లో ఉన్న సమయంలో కాస్త వ్యాయామం కూడా అవసరమని అన్నారు.

Related posts