telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ నెల 24న ఇండియాకు ట్రంప్.. వాణిజ్య ఒప్పందంపై చర్చ!

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. మరో రెండు రోజుల్లో వాషింగ్టన్ నుంచి బయలుదేరే ఆయన ఈ 24న ఇండియాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇండియాతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

గురువారం లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం చాలా పెద్దదని, బ్రహ్మాండమైన వ్యాపార అవకాశాలను ఇరు దేశాలకూ దగ్గర చేస్తుందని అన్నారు. ఈ డీల్ విషయంలో అమెరికా తన ప్రయోజనాలను పక్కన బెట్టబోదని ఓ మెలిక పెట్టారు.

ఈ డీల్ అమెరికాకు మేలు చేకూరుస్తుందని భావిస్తేనే ముందుకు వెళతామని, సరైన విధంగా డీల్ లేదనుకుంటే వెనక్కు తగ్గుతామని తెలిపారు.అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తరువాత డీల్ పై ముందడుగు పడుతుందని, ఎప్పుడు ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని అన్నారు. ట్రంప్ ఇండియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడటం ఇది తొలిసారేమీ కాదు. ఇటీవల కూడా ఆయన ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

Related posts