telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారతీయ మహిళలకు రెట్టింపు విలువ కడతాను… వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’ను వదిలారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను చూడాలంటే రూ.100 చెల్లించాలని నిబంధన పెట్టారు. ‘క్లైమాక్స్’కు భారీ స్పందన వచ్చింది. ప్రేక్షకుల ధాటికి ఆర్జీవీ వరల్డ్ థియేటర్ సర్వర్ క్రాష్ అయిపోయింది. వర్మ ఇప్పుడు దేశీ బూతు బొమ్మ ‘నగ్నం’తో వస్తున్నారు. రాజమౌళి ‘RRR’ మాదిరిగా దీనికి ‘NNN’ అని పేరు పెట్టారు. అంటే ‘నేక్డ్ – నగ్నం – నంగా’ అని వర్మ అభివర్ణించారు. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. అందుకే ‘క్లైమాక్స్’కు రూ.100 పెట్టిన ఆర్జీవీ.. ‘నగ్నం’ చూడాలంటే రూ.200 చెల్లించాలని నిబంధన పెట్టారు. అయితే, ఈ సినిమాకు ఒక్కసారిగా రూ.100 పెంచేయడంపై కారణం చెప్పారు వర్మ. “క్లైమాక్స్‌ను ఒకసారి చూడటానికి రూ.100 తీసుకుని.. దానికన్నా రూ.100 అధికంగా ‘నేక్డ్’కు రూ.200 పెట్టడానికి కారణం ఉంది. అదేంటంటే.. నేను విదేశీ మహిళల కన్నా భారతీయ మహిళలకు రెట్టింపు విలువ కడతాను” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related posts