telugu navyamedia
telugu cinema news

మహానాయకుడు లో .. బుల్లి ఎన్టీఆర్ గా దేవాన్ష్.. 

ntr a biopic book released
దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో చంద్రబాబు, బాలకృష్ణల మనవడు దేవాన్ష్ నటించాడని తెలుస్తోంది. దేవాన్ష్ సీన్ల చిత్రీకరణ పూర్తయిపోయిందని, కెమెరా ముందు దేవాన్ష్ భయపడలేదని చిత్ర వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. 
ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్యా రామ్ కూడా నటించినట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి విదితమే. ఈ సినిమా అనుకున్నంత భారీ కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో, రెండో భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేపనిలో ఉన్నాడు క్రిష్.

Related posts

“బాహుబలి”లో వర్మ వెన్నుపోటు

ashok

సెలవిస్తావా!!…

vimala p

తల్లి పాత్రకు నో చెప్పిన రేణూ దేశాయ్

vimala p