telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇర్ఫాన్ ఖాన్ చివరిమాటలు వింటే కన్నీళ్లు ఆగవు

irfan

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) చాలా కాలంగా క్యానర్స్‌తో పోరాడిన ఆయన ఏప్రిల్ 29వ తేదీన ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ మరణ వార్త తెలిసి బాలీవుడ్‌లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. అయితే మరణానికి కొన్నిక్షణాల ముందు ఇర్ఫాన్ మాట్లాడిన మాటలు మరింత కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే మూడు రోజుల క్రితమే అంటే శనివారం ఏప్రిల్ 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మరణించడం ఆయన్ను మరింత కలిచి వేసిందని, రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన తన తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోవడం ఆయన జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు ఇర్ఫాన్ బంధువులు. లాక్‌డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూసి ఇర్ఫాన్ చాలా బాధపడినట్టు తెలిసింది. గతంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడిన ఆయన, తల్లి మరణం తర్వాత మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఇక చివరకు తన మరణానికి కొన్నిక్షణాల ముందు ‘నన్ను తీసుకెళ్లేందుకు మా అమ్మ వచ్చింది’ అని ఇర్ఫాన్ అనడం జీర్ణించుకోలేక పోయామని ఆ సమయంలో ఇర్ఫాన్ పక్కన ఉన్న బంధువులు పేర్కొన్నారు. ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ముస్లిం శ్మశాన వాటికలో కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఇర్ఫాన్ పార్థివదేహాన్ని ఖననం చేశారు.

Related posts