telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ముగిసిన తొలి దశ ట్రయల్స్.. ‘కోవాగ్జిన్’ సురక్షితం!

covaxin corona

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన ‘కోవాగ్జిన్’ పూర్తిగా సురక్షితమని తెలుస్తోంది. తొలి దశ ట్రయల్స్ లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియాలో మూడు వ్యాక్సిన్ లకు ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

వాటిల్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తో పాటు ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందున్నాయి. ఈ రెండూ ప్రస్తుతం రెండు, మూడవ దశ ట్రయల్స్ లో నిమగ్నమై ఉన్నాయి. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధిస్తున్న వైద్య బృందాల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టులు వస్తున్నాయి.ఈ ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీన్ని తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యాధికారులు వెల్లడించారు.

Related posts