telugu navyamedia
crime news Telangana trending

వామన్‌రావు హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన కాంగ్రెస్ !

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే..  వామన్ రావు సతీమణి కారులోనే మృతి చెందగా, వామన్ రావును ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందారు. అయితే తాజాగా గట్టు వామన్ రావు కుటుంబ సభ్యులను సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా సిఎల్పీ నేత బట్టి మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయవాదుల జంట హత్యలు జరిగినా హోం శాఖ, జిల్లా మంత్రులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ హత్య వెనుక పెద్ద నాయకులు ఉన్నారని వారిని పోలీసు విచారణలో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు న్యాయం చేసే హైకోర్టు న్యాయవాదుల దంపతులను హత్య చేయడం బాధాకరమన్నారు. మృతుడు వామన్ రావు కుటుంబానికి ప్రాణహాని ఉందని తమ దృష్టికి తీసుకువచ్చారని.. వెంటనే డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి రక్షణ కోరతామని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ కనుసన్నల్లో హత్యలు అవుతున్నాయని ఆరోపించారు. శీలం రంగయ్య లాకప్ డెత్ ఇటు హై కోర్టు న్యాయవాదుల హత్యలు జరిగాయని.. వెంటనే ప్రస్తుత పోలీస్ కమిషనర్ ను బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts

రణరంగం.. తో శర్వానంద్, కాజల్..

vimala p

ముఖ్యమంత్రిగా పవర్ స్టార్…!

vimala p

బాలుడికి గత జన్మ స్మృతులు.. తానే డయానా ను.. అంటున్న వైనం..

vimala p