కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తెలంగాణ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హారీష్ రావు కీలక ప్రకటన చేశారు. వెంటనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. దీంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడుతుందని మంత్రి హారీష్‌రావు హామీ ఇచ్చారు. ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకే వారి రిటైర్మెంట్ వయస్సును పెంచామన్నారు. ఇది ఉద్యోగాల భర్తీకి ఏమాత్రం అడ్డంకి కాబోదని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా… ఇవాళ తెలంగాణ శాసనసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్ పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. కనీస పింఛన్ రూ. 50 వేలు, గరిష్ఠ పింఛన్ రూ. 70 వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
previous post
next post