telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీలో చైనా సీసీటీవీ కెమెరాలు..పెద్ద ఎత్తున విమర్శలు

దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై వున్న సీసీటీవీ కెమెరాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. గతంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం కోసం సీఎం కేజ్రీవాల్‌ సర్కారు చైనాకు చెందిన హిక్విజన్ సంస్థ నుంచి 1.45 లక్షల సీసీటీవీ కెమెరాలను కొనుగోలు చేసింది. అయితే, ఈ కెమెరాల లైవ్‌ ఫీడ్‌ ను చూడగలిగే ఓ యాప్ ను ఆ సంస్థ తయారుచేసింది. దాంతో నగర ప్రజలు ఆ సంస్థకు చెందిన సదరు మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

చైనాతో గాల్వన్‌ లోయ వద్ద ఉద్రిక్తతలు నెలకొనడం, భారత్‌ 59 చైనా యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆ యాప్ వల్ల నిఘా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

డ్రాగన్ నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లలో లైవ్ ఫీడ్ చూడటానికి ఢిల్లీ ప్రజలు హిక్విజన్‌ ఐవీఎమ్‌ఎస్‌ 4500 అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని ఓ నిపుణుడు చెప్పారు. యాప్‌ను చైనాకు చెందిన ఆ కంపెనీతో పాటు ఆ దేశ ప్రభుత్వం, ఆర్మీ సులభంగా యాక్సెస్ చేయవచ్చని అన్నారు. ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని చైనా చూడగలదని నిపుణులు చెబుతున్నారు. .

Related posts