telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

తిరుమల వెళుతున్న బస్సు ప్రమాదం.. స్వల్పగాయాలతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..

Road accident 8 dead and 30 injured

తిరుమల పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి సుమారు 26 మంది శ్రీవారి భక్తులతో తిరుమలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మలుపులో అదుపు తప్పింది. ఎడమ వైపు కొండను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులకు ప్రాణాపాయం తప్పింది. తిరుపతి బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సు తిరుమలకు బయలుదేరింది. అలిపిరి టోల్‌గేట్ దాటిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డు రెండో మలుపులో డ్రైవర్‌ను బస్సును నియంత్రించ లేకపోయారు.

వేగంగా వెళ్లిన బస్సు ఎడమ వైపున కొండను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ కొంతదూరం వెళ్లింది. వాహనాలు కొండను ఢీ కొట్టకుండా ఉండటానికి సుమారు అడుగు ఎత్తు వరకు వేసిన డివైడర్‌ను దాటి వెళ్లి మరీ కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులకు ప్రాణాపాయం తప్పింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. క్రేన్లను తీసుకొచ్చి, బస్సును వెలికి తీశారు ఆర్టీసీ ఉద్యోగులు. కాగా- కొద్దిరోజుల కిందటే ఆర్టీసీ బస్సు ఒకటి ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాలీవాన తోడు కావడంతో బస్సు అదుపు తప్పి, లోయలోకి జారిపడబోయింది. లోయ అంచుల్లో ఉన్న చెట్లకు చిక్కుకుని నిలిచిపోయింది.

Related posts