telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

సెంచరీ వికెట్లతో .. బుమ్రా.. రికార్డు..

bumra in 100 wickets club with last match

ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు చేజిక్కిచుకున్న రికార్డులు బోలెడు.. అందులో కొన్ని చాలా ప్రత్యేకం, ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 100 వికెట్ల క్లబ్‌లో చేరడం. ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్లు కరుణరత్నె (10), కుశాల్‌ పెరీరా (18)లను పెవిలియన్‌ పంపిన బుమ్రా తన ఖాతాలో 100 వికెట్లు వేసుకోవడంతో పాటు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా వంద వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డుల్లో ఎక్కాడు. మహ్మద్‌ షమి 56 వన్డేల్లో ఈ ఘనత సాధిస్తే.. బుమ్రా 57 వన్డేల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

తర్వాత స్థానాల్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ (59 వన్డేల్లో), జహీర్‌ ఖాన్‌ (65), అజిత్‌ అగార్కర్‌ (67), జవగళ్‌ శ్రీనాథ్‌ (68) ఉన్నారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. అతి తక్కువ వన్డేల్లో వంద వికెట్లు తీసిన అంతర్జాతీయ బౌలర్‌గా అఎn్గానిస్తాన్‌ యువ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు. రషీద్‌ ఖాన్‌ 44 వన్డేల్లోనే వంద వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతని తర్వాత ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ (52), పాకిస్తాన్‌ బౌలర్‌ సక్లేన్‌ ముస్తాక్‌ (52) టాప్‌-3లో ఉన్నారు.

Related posts