telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన: మంత్రి బొత్స

botsa ycp

ఏపీ శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ తన అధికారాలను  వినియోగించి రాజధాని బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేయనున్నట్లు తెలిపారు.

తొత్తులను తీసుకొచ్చి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారని విమర్శించారు. అందుకే మండలి రద్దు ఆలోచన చేయాల్సి వస్తోందన్నారు. నిబంధనలు పాటించాలని చెప్పినా చైర్మన్‌ పాటించలేదన్నారు. జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులనుబట్టీ ఇలాంటి వ్యవస్థ ఉండాలా లేదా అన్న చర్చే సర్వత్రా ఇప్పుడు నడుస్తోందన్నారు. ఉన్నత పదవుల్లో తాబేదార్లను కూర్చోబెట్టే వ్యవస్థపై చర్చ జరగాలని పేర్కొన్నారు.

Related posts