కరాటే కళ్యాణి.. పేరు తెలియని వారుండరు. ఎందుకంటే.. కరాటే కళ్యాణి 120 కి పైగా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బిగ్‌బాస్‌లోనూ ఈమె అందరినీ సందడి చేసింది. అప్పట్లో శ్రీరెడ్డిపై వివాదస్పద వ్యాక్యలు చేస్తూ.. టీవీల్లో కనిపించింది కరాటే కళ్యాణీ. ఇక ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తూ తన భవిష్యత్‌కు బంగార బాటలు వేసుకుంటున్నారు కరాటే కళ్యాణీ. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి ప్రముఖ మృదంగ విద్వాంసులు, హరికథ భాగవతలు పడాల రామదాసు అదివారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. తండ్రి మరణించిన విషయాన్ని కరాటే కళ్యాణీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని పోస్టులు పెట్టారు. తన తండ్రితో దిగిన ఫోటోలనూ షేర్ చేశారు కళ్యాణి. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. తనను ఒంటిదాన్ని చేసేశారు నాన్న గారూ.. నన్ను తీసుకెళ్లండి.. ఇక్కడ ఉండలేకపోతున్నానని కళ్యానీ ఆవేదన వ్యక్తం చేశారు.