telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళికి కరోనా… బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి… వర్మ షాకింగ్ రియాక్షన్

RGV

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఫలితాలు ఈరోజు వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. దీంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ సినీ లోకం ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ని హోరెత్తించేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ పెట్టిన వెరైటీ ట్వీట్ మాత్రం వైరల్ అయి వార్తల్లో నిలిచింది. ”సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే కరోనా బారి నుంచి కోలుకుంటారు” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ.

Related posts