telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : టైటిల్ విన్నర్ రాహులా ? శ్రీముఖినా ?

telugu bigg boss 3 srimukhi and rahul

ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3కు ఈ ఆదివారం (నవంబర్‌ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్‌’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు. శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌, అలీరెజా, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌లు ఫైన‌ల్‌కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. ఇక నెటిజన్లు కూడా తమ అభిమాన కంటెస్టెంట్ కు ఓట్లు వేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో శ్రీముఖి, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్క‌ర్ ఉన్నారు. వీరిలో ముగ్గురిని ముందుగానే ఎలిమినేట్ చేయ‌నున్నారు బిగ్ బాస్. ఇక మిగిలిన ఇద్ద‌రిని బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఆహ్వానించి ఒక‌రికి టైటిల్‌ని అందించ‌నున్నారు. యాంక‌ర్ శ్రీముఖి, సింగ‌ర్ రాహుల్‌ల మ‌ధ్య ప్ర‌స్తుతం గ‌ట్టి పోటి న‌డుస్తున్న‌ట్టు నెటిజ‌న్స్ చెబుతున్నారు. వీరిలో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే విజేత‌గా నిలుస్తార‌ని అంచ‌నా. అయితే రాహుల్‌ని శ్రీముఖి ఎక్కువ‌గా కార్న‌ర్ చేయ‌డం వ‌ల‌న అత‌నిపై సింప‌తి పెరిగి, ఓట్స్ వేస్తున్నార‌ని కొంద‌రి వాద‌న‌. ఎప్పుడో ఎలిమినేట్ కావల‌సిన వ్య‌క్తిని ఫైన‌ల్ వ‌ర‌కు చేర్చింది శ్రీముఖినే అంటూ కొంద‌రు గ‌ట్టిగా వాదిస్తున్నారు. ఏమైనప్పటికీ బిగ్ బాస్ 3 టైటిల్ విజేతగా రాహుల్ నిలుస్తాడా, లేదంటే శ్రీముఖి నిలుస్తుందా తెలియాలంటే కొద్ది గంటలు వేచి చూడక తప్పదు.

Related posts