telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దాంపత్య సమస్యలు తీరుస్తానంటున్న హీరోయిన్

Bhumi

భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించిన సినిమా “పతి పత్ని ఔర్ వో”. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించారు. ఇందులో భూమి కార్తిక్ భార్య వేదిక పాత్రలో నటించారు. మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కార్తిక్ ప్రియురాలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేశారు. 1978లో ఇదే టైటిల్‌తో వచ్చిన క్లాసిక్ సినిమాకు ఈ సినిమా సీక్వె్ల్‌గా రాబోతోంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాకపోతే ఇందులో కార్తిక్ ఆర్యన్ పెళ్లి తర్వాత జరిగే సెక్స్ గురించి చెప్పిన భారీ డైలాగ్ వివాదాస్పదమైంది. దాంతో ఈ డైలాగ్‌ను తొలగించేసినట్లు డైరెక్టర్ వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భూమి ‘వేదికా లవ్‌లైన్’ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భార్యాభర్తలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను తీర్చగలుగుతానని అంటున్నారు. ‘ఇది ఫన్ సోషల్ మీడియా క్యాంపెయిన్. భార్య, భర్తలతో నేను మాట్లాడి వారి చిన్న చిన్న దాంపత్య సమస్యలను తీరుస్తాను. ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలో నేను భార్య పాత్రను పోషించాను. కాబట్టి భార్యభర్తలకు నాకు తెలిసిన టిప్స్ చెప్పగలను. ఈ క్యాంపెయిన్ ద్వారా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవుతందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.

Related posts